: ఆటగాళ్ళ కదలికలపై ఐసీసీ నిఘా
భారత్, బంగ్లాదేశ్ లను కుదిపేసిన ఫిక్సింగ్ వ్యవహారాలతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మేలుకొంది. రేపటి నుంచి ఇంగ్లండ్ లో మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఆటగాళ్ళ కదలికలపై నిఘా వేయాలని నిర్ణయించింది. తద్వారా టోర్నీలో అవినీతిని అరికట్టాలని భావిస్తోంది. ఆయా జట్లు మ్యాచ్ వేదికల వద్దకు వెళ్ళే సమయంలో బస్సు ఎక్కేముందే వారి సెల్ ఫోన్లను అధికారులకు అప్పగించాలని ఐసీసీ పేర్కొంది. మైదానం లోపల, వెలుపల ఆటగాళ్ళ ప్రవర్తనను అవినీతి నిరోధక విభాగం (ఏసీఎస్ యూ) అధికారులు నిశితంగా పరిశీలిస్తారని ఐసీసీ తెలిపింది.