: మాకు మాటేనా సెప్పాలి కదా?: కేంద్ర మంత్రిపై శ్రీకాకుళం ఎమ్మెల్యేల కినుక


కేంద్ర మంత్రి కృపారాణిపై సొంత జిల్లా ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులమైన మన మద్యే సమాచార మార్పిడీ లేకపోతే ఎలా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగతమైతే సరే కానీ, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల పట్ల కనీస సమాచారం ఇవ్వకపోవడంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చెయ్యాలనుకుంటున్నారు. ఇంతకీ, శ్రీకాకుళం ప్రజాప్రతినిధులపై చిచ్చుకు కారణమైన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ సంకల్ప్ యాత్రను ఆ జిల్లాలో నిర్వహించనున్నారని, ఈ విషయంపై ముందే తెలిసినా కనీసం మాట మాత్రమైనా తమతో చెప్పలేదని ఆ జిల్లా ఎంపీ అయిన కిల్లి కృపారాణిపై శ్రీకాకుళం ఎమ్మెల్యేలంతా గుర్రుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News