: జంతుజాలానికి శత్రువు మానవుడే : అమల
జంతువులు, పక్షి జాతులకు మనిషి శత్రువుగా మారుతున్నాడని అక్కినేని అమల అన్నారు. పాముల దగ్గర నుంచి పక్షుల వరకు ప్రతిఒక్క జంతువుపై మనిషి దానవత్వాన్ని చూపుతున్నాడని ఆమె చెప్పారు. అంతేకాదు, భారత్ లో జంతుజాలాలకు రక్షణ లేదన్నారు అమల. ఇతర దేశాలతో పోలిస్తే ఇది అతి తక్కువగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితివల్ల జంతుజాలాల రక్షణ చాలా కష్టంగా ఉంటుందని చెప్పారు. అందుకే, మూగ జీవాలను కాపాడాలనే ఉద్దేశంతో బ్లూక్రాస్ సంస్థను స్థాపించినట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమల జంతువుల జీవనంపై వివరంగా ప్రసంగించారు.