: ఎంసెట్ ఫలితాలు విడుదల
ఎంసెట్ ఫలితాలను డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విడుదల చేసారు. మొత్తం 3,76,879 మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్షల్లో మెడిసిన్ లో 99,983 మంది పరీక్షలు రాయగా, వారిలో 80.79 శాతం ఫలితాలతో 80,778 మంది అర్హత సాధించగా, ఈ విభాగంలో మొదటి ర్యాంకును వీనీత్ సాధించాడు. ఇంజనీరింగ్ లో మొత్తం 2,76,996 మంది పరీక్షకు హాజరు కాగా, 72.67 శాతం ఫలితాలతో 2,01,308 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ లో మొదటి ర్యాంకును సందీప్ రెడ్డి సాధించాడు. ఈ ఏడాది ఇంజనీరింగ్ లో 50 వేల సీట్లు పెరిగాయని రాజనర్సింహ తెలిపారు. ఎంసెట్ కౌన్సిలింగ్ జూన్ 17 న మొదలై జూలై 31 వరకూ జరుగుతుందన్నారు. వీరికి తరగతులు ఆగష్టు 1 వ తేదీ నుంచి మొదలవుతాయని తెలిపారు.