: నక్సల్స్ ని బహుముఖ ప్రణాళికతో అణచివేశాం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి


గత 40 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ నక్సల్స్ సమస్య ఎదుర్కొంటోందని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో జరుగుతున్న ముఖ్యమంత్రుల సదస్సులో తెలిపారు. అయితే నక్సల్స్ అణచివేతకు ఆంధ్రప్రదేశ్ బహుముఖ ప్రణాళిక అమలు చేసిందన్నారు. సమర్ధవంతమైన ప్రత్యేక గ్రేహౌండ్స్ దళాలు ఏర్పాటు చేసామని, ఆధునిక ఆయుధాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వారిని మట్టుబెట్టామన్నారు. నిఘావ్యవస్ధను పటిష్టం చేసేందుకు వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాథి అవకాశాలను కల్పించామని తెలిపారు. విద్య, ఉపాధి అవకాశాలు కల్పించి, సామాజిక అంతరాలు తగ్గించామని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రోత్సహించామన్నారు.

  • Loading...

More Telugu News