: ఏపీపీఎస్సీలో అక్రమాలపై సీఎం స్పందన.. పరీక్షలు ఆపాలని ఆదేశం


భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాల ప్రకటన వెలువడి కొద్దిరోజులు కూడా గడవకముందే నిరుద్యోగులకు చేదువార్త వినిపించింది కాంగ్రెస్ సర్కారు. ఏపీపీఎస్సీలో జరుగుతున్న అక్రమాలపై స్పందించిన సీఎం కిరణ్ వెంటనే ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలు, ఇంటర్వ్యూలు ఆపేయాలని ఆదేశించారు. హస్తినలో ఉన్న ముఖ్యమంత్రి అక్కణ్ణుంచే అధికారులకు పలు సూచనలు చేశారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై ఏబీఎన్ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ప్రభుత్వ వర్గాల్లో చురుకు పుట్టించింది. ఏపీపీఎస్సీలో దళారుల ప్రమేయం ఎక్కువైందంటూ పలువురు ఫిర్యాదులు చేయడంతో.. ఈ విషయమై ఏబీఎన్ శూలశోధన చేపట్టింది. దీంతో, బోర్డులో అక్రమార్కుల గుట్టురట్టయింది.

వివిధ కీలక ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న దళారుల భాగోతం వెలుగులోకి వచ్చింది. ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడు సీతారామరాజు ఈ కుంభకోణంలో ప్రధానపాత్రధారి అన్న విషయం ఏబీఎన్ స్టింగ్ ఆపరేషన్ తో బట్టబయలైంది. ఈయనకు సంధ్య అనే దళారీ తోడ్పడినట్టు చానల్ పేర్కొంది. కాగా, ఏపీపీఎస్సీ లో అక్రమాలపై కథనం ప్రసారం కావడంతో సీతారామరాజు, సంధ్య అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

  • Loading...

More Telugu News