: శిల్పాశెట్టి భర్తను ప్రశ్నించిన పోలీసులు


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో రాజస్థాన్ రాయల్స్ యజమాని, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను నేడు ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. రాజస్థాన్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ లు ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టవడంతో, ఆ ఫ్రాంచైజీ యజమాని అయిన రాజ్ కుంద్రాను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో, ఫిక్సింగ్, బెట్టింగ్ లతో ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో కుంద్రాను ప్రశ్నించినట్టు సమాచారం. కాగా, కుంద్రాను విచారిస్తోన్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సిద్దార్థ్ త్రివేది కూడా అక్కడే ఉన్నాడు. త్రివేది అంతకుముందే పోలీసులకు ఫిక్సింగ్ విషయమై వాంగ్మూలం ఇచ్చాడు.

  • Loading...

More Telugu News