: ధోనీ భార్య పక్కన కూర్చోవడమే నేను చేసిన పెద్ద తప్పు: విందూ
స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయి బెయిల్ పై విడుదలైన విందూ దారాసింగ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. టీమిండియా కెప్టెన్ ధోనీ భార్య సాక్షి పక్కన కూర్చోవడమే తన జీవితంలో చేసిన పెద్ద తప్పిదంగా పేర్కొన్నాడు. సాక్షి పక్కన కూర్చుని మాట్లాడుతూ, కేరింతలు కొడుతూ మ్యాచ్ ను వీక్షిస్తున్న ఫొటోలు ప్రముఖంగా దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కూర్చున్నందుకు సాక్షికి క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించాడు. స్పాట్ ఫిక్సింగ్ గురించి తానే క్రికెటర్ తోనూ మాట్లాడలేదని, దాంతో తనకు అసలు సంబంధమే లేదన్నాడు. ఒక్క గురునాథ్ మయ్యప్పన్ మాత్రమే తెలుసని, అతడు తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు.