: మోపీదేవికి బెయిల్ ఇవ్వకండి: సీబీఐ
జగన్ అక్రమాస్తుల కేసులో ఏడాదికిపైగా కస్టడీలో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ప్రస్తుతం వాన్ పిక్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కోర్టుకు సీబీఐ తెలిపింది. మరోవైపు ఇదే కేసులో ముఖ్య నిందితుడు ఆడిటర్ విజయసాయిరెడ్డి ఈ రోజు సీబీఐ కోర్టులో లొంగిపోనున్నారు.