: సోనియాతో చిరంజీవి భేటీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కేంద్ర మంత్రి చిరంజీవి 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ చర్చలో సి. రామచంద్రయ్య వ్యవహారం, తాజా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వంటి అంశాలపై చర్చించారు. గత కొంత కాలంగా దేవాదాయ శాఖామంత్రి సి. రామచంద్రయ్య ముఖ్యమంత్రిగా చిరంజీవి అయితే బాగుంటుందని, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఆ పదవికి సరైన వ్యక్తి కాదంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. పలు బహిరంగ వేదికలపై కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.

తాజాగా డీఎల్ బర్తరఫ్ నేపధ్యంలో తదుపరి వేటు రామచంద్రయ్య మీదే ఉంటుందని గత రెండు రోజులుగా పుకార్లు షికారు చేసాయి. ఈ నేపధ్యంలో చిరంజీవి సోనియాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. దీంతో పార్టీని బతికించుకునేందుకు ఏం చేయాలంటూ విశ్లేషించుకున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News