: మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు... ఈ అర్థరాత్రి నుంచి అమలు
సగటుజీవిపై
మళ్ళీ పెనుభారం పడింది. ఇప్పటికే పెంచిన ధరలతో సతమతమవుతుంటే, మరోసారి
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. పెట్రోల్ ఒక లీటర్
కు రూ. 1.50, డీజిల్ లీటర్ కు 45 పైసలు పెంచారు. పెంచిన ధరలు ఈ
అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.
కాగా, గత జనవరిలో పెట్రోల్ ధర లీటర్ పై 30 పైసలు తగ్గించిన సంగతి తెలిసిందే. చమురు ఉత్పత్తి సంస్థల ఒత్తిడి కారణంగానే మళ్లీ ధరలు పెంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చమురు సంస్థలు లీటర్ డీజిల్ కు రూ.9.22 , కిరోసిన్ లీటర్ కు 31.60, గ్యాస్ సిలిండర్ (14.2 కి) ఒక్కింటికి రూ. 481.03 నష్టపోతుండడం ధరల పెంపుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.