: టాలీవుడ్ వదలను.. రాజకీయాల్లోకి పోను: మహేష్ బాబు


తానెప్పటికీ టాలీవుడ్ లోనే ఉంటానని రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని హీరో మహేష్ బాబు స్పష్టం చేశారు. మరో పదేళ్ల పాటు టాలీవుడ్ లోనే ఉంటానన్నారు. విజయవాడ ఏలూరు రోడ్డులో రెయిన్ బో చిన్నారుల హాస్పిటల్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన తొలిచిత్రం 'రాజకుమారుడు' నుంచీ విజయవాడతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. తన నటనా జీవితంలో '1 నేనొక్కడినే' చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందని, అందులో కొత్తగా కనిపిస్తాననీ అన్నారు. జేమ్స్ బాండ్ లాంటి పాత్రలను చేసి తన తండ్రి సినిమాలకు చెడ్డపేరు తెచ్చే ఉద్దేశం లేదన్నారు.

  • Loading...

More Telugu News