: భారత్ లోకి ప్రవేశించిన అమెజాన్
ప్రపంచ ఆన్ లైన్ రిటెయిల్ దిగ్గజం అమెజాన్ భారత్ లోకి అడుగుపెట్టింది. భారత వినియోగదారుల కోసం ప్రత్యేకంగా amazon.in పేరుతో వెబ్ సైట్ ప్రారంభించింది. అయితే ప్రస్తుతానికి ఇందులో తన సొంత ఉత్పత్తులను అమెజాన్ విక్రయించదు. ఇతర విక్రయదారులు తన వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు సాగించుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రస్తుతానికి ఈ సైట్ లో పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.