: శ్రీశాంత్ కు జీవిత ఖైదు పడుతుందా?


తాను ఇలా బుక్కవుతానని, జైలుకెళతానని శ్రీశాంత్ ఊహించి ఉండడు. కానీ జైలు పక్షిలా మారాడు. ముంబై అండర్ వరల్డ్ మాఫియా డాన్ లు దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ ఆటాడిస్తే శ్రీశాంత్ తోపాటు ఇతర క్రికెటర్లు ఆడినట్లు తాజాగా పోలీసులు కోర్టుకు విన్నవించిన సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం 'మోకా' కింద కేసు నమోదుకు కోర్టు కూడా అనుమతించింది. శ్రీశాంత్ నేరం నిరూపితమైతే ఇందులో సెక్షన్ 3 ప్రకారం గరిష్ఠంగా జీవిత ఖైదు పడుతుంది. సెక్షన్ 4 ప్రకారం అయితే పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. స్పాట్ ఫిక్సింగ్ నేరానికి పాల్పడినట్లు, దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ తదితరులతో అరెస్టయిన క్రికెటర్లకు సంబంధాలు ఉన్నాయనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. దీంతో శ్రీశాంత్ తదితరులకు లైఫ్ జైలేనని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News