: అంబారాన్నంటిన క్వీన్ ఎలిజబెత్ పాలన సంబరాలు


బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 పాలన 60 ఏళ్లు దాటిన సందర్భంగా లండన్ లోని వెస్ట్ మినిస్టర్ చర్చిలో సంబరాలు అంబరాన్నంటాయి. 200 మంది అతిథులు హాజరైన ఈ మహోత్సవానికి యువరాజు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ సహా 20 మంది కుటుంబ సభ్యులు వెంటరాగా రాణి ఎలిజబెత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్వీన్ ఎలిజబెత్ తన 27 ఏళ్ల వయసులో అంటే 1953 వ సంవత్సరంలో బ్రిటన్ రాణిగా, కామన్వెల్త్ అధ్యక్షురాలిగా తన ప్రస్థానాన్ని ఇక్కడ్నుంచే ప్రారంభించారు. దీంతో ఆమె ఈ సంబరాలను ఇక్కడే జరుపుకున్నారు. అప్పట్లో ఆ కార్యక్రమానికి హాజరైన కొంతమంది తాజా ఉత్సవాల్లో పాల్గోవడం విశేషం.

  • Loading...

More Telugu News