: పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు ఆగ్రహం
ప్రజలు నమ్మి ఓటేస్తే నేతలు పార్టీని విడిచి వెళ్లడం దారుణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పార్టీని వీడి వెళ్లేవారిని చూసి అధైర్యపడమని ఆయన తెలిపారు. 'వస్తున్నా- మీ కోసం' పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా గుడివాడలో పర్యటిస్తున్న చంద్రబాబును కాలినొప్పి బాధిస్తోంది.
అయినా ప్రజల కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తానని ఆయన అన్నారు. జగన్ వంటి అవినీతి నేతలు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే సాయిరాజ్ లపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే.