: ఆదిలాబాద్ అడవుల్లో కూంబింగ్.. పేలుడు పదార్థాలు స్వాధీనం
ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలంలోని అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గంగారం గ్రామంలో మావోయిస్టుల డంప్ బయటపడింది. 6 డిటోనేటర్లు, 5 జిలెటిన్ స్టిక్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.