: మీ సాక్సులే దోమ వినాశకాలు!
ఇకమీదట దోమలను అరికట్టేందుకు దోమల మందులు, దోమ తెరలను వాడాల్సిన పనిలేదు. మీరు బాగా వాడేసిన కంపుకొట్టే సాక్సులనే ఉపయోగిస్తే సరి...! ఎందుకంటే ఆ సాక్సులనుండి వచ్చే కంపుకే దోమలు బాగా ఆకర్షించబడతాయి. అప్పుడు వాటిని అంతం చేసేయొచ్చు అంటున్నారు పెన్సిల్వేనియా వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ రీడ్.
మనం వేసుకునే సాక్సులు ఒక్కోసారి బాగా కంపు కొడతాయి. ఆ కంపు దోమలను బాగా ఆకర్షిస్తుంది. అయితే అన్నింటినీ కాదండోయ్... కేవలం మలేరియాను కలుగజేసే దోమలనే ఈ కంపు బాగా ఆకర్షిస్తుందట. దీంతో ఎంచక్కా ఆ వాసన చూసుకుంటూ మిగిలిన దోమలకన్నా ముందుగా మలేరియా కలుగజేసే దోమలు ఆ కంపు దగ్గరకు వచ్చేస్తాయి. అప్పుడే వాటిని అంతం చేసేయొచ్చని ఆయన అంటున్నారు. కాబట్టి మలేరియా మన దరి చేరకుండా ఉండాలంటే... మన కంపు సాక్సులను దగ్గరుంచుకుంటే సరి...!