: వన్‌డే మిస్‌ యూనివర్స్‌!


మిస్‌ యూనివర్స్‌ కెనడా పోటీల్లో చక్కగా గెలిచి, కిరీటాన్ని అందుకుని ఒకరోజు కూడా కాకముందే ఠక్కున కిరీటం నీకు కాదు... ఇంకొకళ్లకి అంటే ఎలా ఉంటుంది...? పాపం 26 ఏళ్ల డినైస్‌ గార్రిడో పరిస్థితి కూడా అలానే ఉంది... మిస్‌ యూనివర్స్‌ కెనడాగా ఎంపికైన మరునాడే అసలైన అందాల భామ ఆమె కాదని నిర్వాహకులు ప్రకటించారు. కిరీటం మరో మగువ కైవసం అయింది.

మిస్‌ యూనివర్స్‌ కెనడా పోటీల్లో పాల్గొన్న అందాల భామలకు వచ్చిన మార్కుల్ని కంప్యూటర్‌లో ఎంటర్‌ చేయడంలో ఒక గుమస్తాగారు కాస్త పరధ్యానంగా ఉన్నారు. దీంతో పొరబాటు జరిగింది. ఫలితంగా ఇలా జరిగింది. అసలు విజేత గార్రిడో కాదని, 25 ఏళ్ల శాంటోస్‌ అని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో పాపం గార్రిడో ఉసూరుమంది. అయితే ఆమెను వచ్చే ఏడాది మిస్‌ యూనివర్స్‌ కెనడా పోటీల్లో జడ్జిగా ఆహ్వానించడంతోబాటు శాంటోస్‌తోబాటు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తామని నిర్వాహకులు ప్రకటించడంతో పాపం ఆమెకు కాస్త ఊరట లభించింది.

  • Loading...

More Telugu News