: టీడీపీ ఎమ్మెల్యేకు స్పీకర్ నోటీసులు
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నోటీసులు జారీ చేశారు. కమలాకర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, అతడిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ నాయకుడు ధూళిపాళ్ళ నరేంద్ర చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ తాజా చర్యకు ఉపక్రమించారు. టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై వివరణ ఇవ్వాలంటూ, కమలాకర్ కు వారం రోజుల గడువు విధించారు.