: రెండోదఫా బడ్జెట్ సమావేశాలు ఈనెల 10 నుంచి
రాష్ట్ర అసెంబ్లీ రెండోదఫా బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10న ఆరంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభా సమావేశాల నోటిఫికేషన్ ను నేడు విడుదల చేశారు. కాగా, శాసనమండలి ఈ నెల 17న సమావేశం కానున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే సమావేశాల్లో సర్కారుకు అవినీతి మంత్రుల వ్యవహారంలో విపక్షాల నుంచి తలనొప్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులంటున్నారు.