: లోకేశ్ ను పైకి తేవడం లోకకల్యాణమా?: షర్మిల
వైఎస్సార్సీపీ నేత షర్మిల.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. ఇకపై లోకకల్యాణం కోసం పాటుపడతానని బాబు చెబుతున్నాడని.. కుమారుడు లోకేశ్ ను పైకి తేవాలనుకోవడం లోకకల్యాణమెలా అవుతుందని షర్మిల ప్రశ్నించారు. తనయుడు లోకేశ్ ను ఒక్కడినే ఉద్ధరించాలనుకోవడం సమంజసం కాదని ఆమె అన్నారు. ఈ సాయంత్రం రాజమండ్రి కోటిపల్లి సెంటర్ లో జరిగిన 'మరో ప్రజాప్రస్థానం' యాత్ర బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి బాబుకు సీఎం పీఠాన్ని లాగేసుకున్నారని విమర్శించారు. పదవీకాంక్షే బాబును మామకు ద్రోహం చేసేలా పురిగొల్పిందని ఆమె ఆరోపించారు.