: వివాదంలో 'ఇద్దరమ్మాయిలతో..' సినిమా
అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇటీవలే విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోన్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాన్ని ఓ వివాదం చుట్టుముట్టింది. ఈ సినిమాలో బ్రహ్మానందంపై చిత్రీకరించిన 'శంకరాభరణంతో స్నానం చేస్తా' అంటూ మొదలయ్యే పాటను తొలగించాలని విశాఖపట్నంలోని సంగీత ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో శాస్త్రీయ సంగీతాన్ని అపహాస్యం చేసేలా ఆ పాట ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకరాభరణం, హిందోళ రాగాలను అవమానించినందుకు నిరసనగా ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వివాదానికి కారణమైన పాటను వెంటనే తొలగించాలని వారు మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ను కోరారు.