: ఫిక్సింగ్ వ్యవహారంలో బంగ్లా మాజీ కెప్టెన్ పై వేటు


పక్షం రోజుల క్రితం ఐపీఎల్ ను కుదిపేసిన ఫిక్సింగ్ జాఢ్యం పొరుగుదేశం బంగ్లాదేశ్ క్రికెట్ నూ పట్టిపీడిస్తోంది. బంగ్లా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఫిక్సింగ్ కు పాల్పడినట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అష్రాఫుల్ నేరాన్ని అంగీకరించడంతో అతనిపై వేటు పడింది. అన్ని ఫార్మాట్ల నుంచి అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు బంగ్లా క్రికెట్ బోర్టు నేడు ప్రకటించింది. రూ.7 లక్షలు తీసుకుని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ఓడిపోయేందుకు సహకరించాడని అష్రాఫుల్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఐసీసీ అనుబంధ సంస్థ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీఎస్ యూ) అష్రాఫుల్ తప్పు చేశాడని నిర్ధారించింది.

  • Loading...

More Telugu News