: సౌదీలో వ్యక్తికి శిరచ్ఛేదం
సౌదీ అరేబియాలో ఓ వ్యక్తికి నేడు శిరచ్ఛేదం అమలు చేశారు. షువైల్ అల్ అమ్రి అనే వ్యక్తి తన సమీప బంధువైన మహ్మద్ అల్ అమ్రిని కారుతో ఢీ కొట్టి చంపేశాడు. దీనికంతటికీ కారణం ఓ చిన్న వివాదమేనని సౌదీ అధికార వర్గాలు తెలిపాయి. విచారణలో షువైల్ దోషిగా తేలడంతో సౌదీ నైరుతి ప్రాంతం అల్-బాహాలో కత్తితో అతడి తల నరికి శిక్షను అమలు చేశారు. కాగా, కఠిన చట్టాలకు పేరుగాంచిన సౌదీలో ఈ ఏడాది ఇది 48వ మరణశిక్ష. హత్య, అత్యాచారం, మత ధర్మాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, మాదక ద్రవ్యాల రవాణా, సాయుధ దోపిడీ వంటి తీవ్ర నేరాలకు పాల్పడితే సౌదీలో మరణశిక్ష తప్పదు.