: విశాఖలో బీచ్ వాలీబాల్ పోటీలు
విశాఖపట్నం వేదికగా ఇండియన్ ఓపెన్ బీచ్ వాలీబాల్ అంతర్జాతీయ పోటీలు సెప్టెంబర్ లో జరుగనున్నాయని క్రీడా శాఖా మంత్రి వట్టి వసంతకుమార్ హైదరాబాద్ లో తెలిపారు. విశాఖ బీచ్ వేదికగా గతంలో తైక్వాండో జాతీయ స్థాయి పోటీలు జరిగాయి. కబడ్డీ పోటీలు కూడా జరిగాయి. తాజాగా బీచ్ వాలీబాల్ పోటీలు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 64 దేశాల పురుష, మహిళా జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు మూడు రోజులపాటు జరుగనున్న ఈ టోర్నీ వివరాలను వట్టి వసంతకుమార్ సచివాలయం లో వెల్లడించారు. మన రాష్ట్రానికి చెందిన ఆత్యుత్తమ క్రీడాకారులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని మేటి ఆటగాళ్లు కూడా పాల్గోనున్నారని ఆయన తెలిపారు.