: కాలేజీలో దాడిపై హీరో నిఖిల్ వివరణ
తన సోదరుడిపై ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై దాడి చేసినట్టు ఆరోపణలెదుర్కొంటున్న హీరో నిఖిల్ ఆ ఘటనపై వివరణ ఇచ్చాడు. తానెవరినీ కొట్టలేదన్నాడు. తమ్ముడు రోహిత్ ను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో కాలేజి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడానికే అక్కడికెళ్ళానని చెప్పాడు. ప్రిన్సిపాల్ సాయంతో సీనియర్ విద్యార్థులను పోలీసులకు అప్పగించానని వెల్లడించాడీ కుర్ర హీరో. అయితే, నిఖిల్ తమపై దౌర్జన్యం చేశాడని సదరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ అంతు చూస్తానని బెదిరించాడని కూడా వారు తెలిపారు.