: జంట నగరాల్లో ఇంకుడు గుంతల పథకం
ఏటికేడు పెరుగుతున్న నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రుతుపవనాలు ప్రవేశించి, వర్షాలు కూడా కురుస్తుండడంతో నీరు రోడ్డు పాలు కాకుండా, భూమిలోకి ఇంకి పోయేందుకు జీహెచ్ ఎంసీ అధికారులు ఇంకుడు గుంతల్ని తవ్వించనున్నారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్యభవన్ లో జరిగిన ఇంకుడుగుంతల అవగాహన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ, ఈ ఏడాది 6 కోట్ల రూపాయల వ్యయంతో 10 వేల ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే అధికారులకు తగిన సూచనలు ఇచ్చిందన్నారు. వీటి గురించిన సమాచారం కావాలన్నా లేక ఏవైనా అనుమానాలున్నా అధికారుల్ని సంప్రదించాలని మేయర్ తెలిపారు.