: తమ్ముడి కోసం హీరో నిఖిల్ దాదాగిరి


'హ్యాపీడేస్' సినిమాతో చిత్రసీమకు పరిచయమైన కుర్రహీరో నిఖిల్ ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. విషయం ఏంటంటే.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన దుండిగల్ వద్ద సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజీలో నిఖిల్ సోదరుడు రోహిత్ మొదటి సంవత్సరం ఇంజినిరీంగ్ చదువుతున్నాడు. సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో రోహిత్ వారిపై చేయి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న హీరో నిఖిల్ కాలేజీ వద్దకు చేరుకుని హల్ చల్ చేశాడు. అక్కడి విద్యార్థులను పరీక్ష రాయనీయకుండా అడ్డుకున్నాడు. విషయం పోలీసుల వరకూ వెళ్ళడంతో వారు అక్కడికి చేరుకుని కాలేజీ గేట్లను మూసివేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News