: అమ్మో... ఆర్టీఐ మాక్కూడానా?: రాజకీయ పార్టీలలో గుబులు
ఆర్టీఐ చట్టాన్ని రాజకీయ పార్టీలకు వర్తింపజేయాలని సమాచార కమీషన్ ఇచ్చిన తీర్పును రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఆర్జెడీ, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు సమాచారహక్కు చట్టాన్ని వ్యతిరేకించగా, తాజాగా ఈ లిస్టులో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి చేరింది. రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఈ చట్టం విఘాతం కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. రాజకీయ పార్టీలు ప్రజలకు మాత్రమే జవాబుదారీ అనీ, మరెవరికీ కాదని జేడీయూ నేత శరద్ యాదవ్ అన్నారు.