: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు పెద్దపీట: జానారెడ్డి


పంచాయతీ రాజ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాట్లాడడం కోసమే అధిష్ఠానం తనను పిలిపించినట్టు రాష్ట్ర మంత్రి జానారెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఆజాద్ కు తెలిపానన్నారు. ఈసారి ఎస్సీ, ఎస్టీలకు అధిక అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఎస్సీలకు 18.88 శాతం, ఎస్టీలకు 9.15 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నామన్నారు. తెలంగాణ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరానన్నారు. జానాతో పాటు ఢిల్లీ వెళ్ళొచ్చిన ఎంపీ రాజయ్య చెబుతూ, అధిష్ఠానంపై తానింకా నమ్మకం కోల్పోలేదని, తెలంగాణ ఇవ్వాల్సింది జాతీయ పార్టీలేనని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తప్పక ఇస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News