: సీబీఐ ధాటికి బన్సల్ ఉక్కిరిబిక్కిరి
రైల్వే స్కాంలో ఇరుక్కున్న కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ సీబీఐ ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిరయ్యారు. రైల్వే ముడుపుల వ్యవహారంలో ఈపాటికే అరెస్టయిన బన్సల్ మేనల్లుడు విజయ్ సింగ్లా.. తాను రైల్వే అధికారి మహేశ్ నుంచి ముడుపులు స్వీకరించింది మేనమామ నివాసంలోనే అని పోలీసు విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో, బన్సల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. రైల్వే బోర్డులో నియామకాలు జరగాలంటే, రైల్వే మంత్రి ఆమోదం తప్పనిసరి. ఈ కోణంలో విచారణ జరపాలని నిర్ణయించిన సీబీఐ అధికారులు నేడు ఢిల్లీలో బన్సల్ ను ప్రశ్నిస్తున్నారు.
రైల్వే అధికారి మహేశ్ కు రైల్వే బోర్డులో స్థానం కల్పిస్తానంటూ.. సింగ్లా రూ.10 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందస్తుగా రూ.90 లక్షల ముడుపులు అందుకుని పోలీసుల చేత చిక్కడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.