: జియాఖాన్ మృతి చెందిందా.. ఓహ్ గాడ్.. : అమితాబ్
బాలీవుడ్ వర్ధమాన నటి జియాఖాన్ తన స్వగృహంలో మృతి చెందిందన్న వార్తను పలువురు నటీనటులు జీర్ణించుకోలేక పోతున్నారు. కొందరైతే 'అవునా నిజమా?' అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వార్త నిజమా? కాదా? అని సన్నిహితులకు ఫోన్ చేసి వాకబు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ 'అయ్యో చనిపోయిదా... ఎలా?' అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. 'అసలేం జరిగింది.. ఇది నిజమా.. నమ్మలేకపోతున్నాను' అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అర్షాద్ వార్సీ అయితే 'అరే, ఆమెకు చాలా భవిష్యత్ వుండగా, చిన్నవయసులోనే కాలం చేసిందా?' అని ఆశ్చర్యపోయారు. జియా ఎంతో మంచిదనీ, చిన్నితనంలోనే అన్నీ తొందరగా సాధించిందని చెబుతూ ఫరాఖాన్ బాధపడింది. షాహిద్ కపూర్, రితేష్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ, 'చాలా మంచి సహనటి' అని కితాబు ఇస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.