: డీఎల్ నోటికి తాళం?
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన డీఎల్ రవీంద్రారెడ్డికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తన భర్తరఫ్ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం సీఎల్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడతానని విదేశాల నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా నిన్న రాత్రి డీఎల్ చెప్పారు. కానీ, డీఎల్ కు ఆ అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో సీఎల్పీ సిబ్బంది కార్యాలయానికి తాళం వేశారు. దీనిపై ఆగ్రహించిన డీఎల్ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఫిర్యాదు చేశారు.