: ఆసీస్ బౌలింగ్ వర్సెస్ టీమిండియా బ్యాటింగ్


ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు రెండో సన్నాహక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ ను భారత్ ఢీకోనుంది. శ్రీలంకపై భారీ లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ ఛేదించిన టీమిండియా మరోసారి అలాంటి ప్రదర్శనే చేయాలనుకుంటోంది. భారత బ్యాట్స్ మన్ కు సిసలైన పరీక్ష ఆస్ట్రేలియా జట్టు రూపంలో ఎదురుపడింది. ఇంగ్లాండ్ బౌన్సీ పిచ్ లపై రాణించాలంటే సిసలైన బౌలర్లను ఎదుర్కోవాలని భారత జట్టు ఆశ పడుతోంది. జట్టు కోరుకున్నట్టే మిషెల్ జాన్సన్, షేన్ వాట్సన్, ఫాల్కనర్, మైకేల్ స్టార్క్, మెక్ కే, డోహార్తీ తోకూడిన ఆసీస్ జట్టు బౌలింగ్ దాడిని కోహ్లీ, రైనా, రోహిత్, కార్తిక్, ధావన్, ధోనీ తో కూడిన టీమిండియా బ్యాట్స్ మన్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి జరుగనుంది.

  • Loading...

More Telugu News