: సీమను చుట్టేసిన రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు రాయలసీమలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాయని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాలకు విస్తరిస్తాయని, ఈ నెల 10 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరణ పూర్తవుతుందని తెలిపింది.