: వీవీఐపీల హెలికాఫ్టర్ ప్రత్యేకతలు!
ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న తాజా కుంభకోణం వీవీఐపీల భద్రత కోసం కొనుగోలు చేసిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్..అసలు ఈ చాపర్ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..
'అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్'... ఒక్క హెలికాప్టర్ విలువ రూ.300 కోట్లు... వామ్మో... ఇంత ధరా? అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే... వీవీఐపీల ప్రయాణం కోసం రూపొందించిన హై సెక్యూరిటీ హెలికాప్టర్ ఇది. అగస్టా AW- 101 హెలికాప్టర్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉపయోగిస్తారు.
ఇటలీకి చెందిన ఫిన్ మెకానికా కంపెనీ ... AW సిరీస్‌పేరుతో అగస్టా హెలికాప్టర్లు తయారు చేస్తోంది. ఇటలీ ఉత్తర ప్రాంతంలో 1923లోనే హెలికాప్టర్ల ఉత్పత్తి ప్రారంభించింది. రెండో ప్రపంచ యుద్ధంలోనూ దీని ముఖ్య ఉద్దేశం ... వీవీఐపీల ప్రయాణం. పరిశోధక, సహాయక, సైనిక చర్యల్లోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. అగస్టా హెలికాప్టర్లలో ఇద్దరు పైలట్లుంటారు. మూడు ఇంజన్లుంటాయి. ఒకటి ఫెయిలైతే మరొకటి... అదీ విఫలమైతే... మూడోది పనిచేస్తుంది.
AW 101 హెలికాప్టర్ గంటకు 278 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఏక బిగిన 1058 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 5 గంటలా 10 నిమిషాలు ఆగకుండా వెళ్లగలదు. ఒకేసారి 36 మంది ప్రయాణించవచ్చు. దీనికుండే 4 ట్యాంకుల్లో... 4094 లీటర్లు ఇంధనాన్ని నింపుకోవచ్చు. 15వేల అడుగుల ఎత్తు వరకు వెళ్తుంది. ప్రమాదాలను నివారించేలా అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాబిన్, కాక్‌పిట్, సీట్లకు సాయుధ భద్రత వుంటాయి. ప్రమాద సమయాల్లో ఇంజన్ ట్యాంకులు వాటంతటవే మూసుకుంటాయి. దీనివల్ల మంటలు చెలరేగవు.

వీవీఐపీల భద్రత, వసతుల్లో దీనికి ఇదే సాటి. క్యాబిన్ ఎత్తు 1.83 మీటర్లు. ఇతర హెలికాప్టర్లలోలాగా వంగి ప్రవేశించాల్సిన అవసరంలేదు. నిటారుగా నిల్చునేంత ఎత్తు ఉంటుంది. లగేజ్ పెట్టుకునేందుకు వెనుకవైపు చాలా స్థలం ఉంటుంది. 'యాక్టివ్ వైబ్రేషన్ సిస్టమ్' వల్ల ... చాలా తక్కువ శబ్దం వస్తుంది. వీవీఐపీల అవసరాలకు అనుగుణంగా లోపలి భాగాలను డిజైన్ చేసుకోవచ్చు. ప్రయాణ సమయంలో కాలక్షేపానికి అవసరమైన టీవీలు కూడా ఉంటాయి. హిమపాతం నుంచి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తుంది. ఇందులో వుండే డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థ సాయంతో... ఎక్కడికైనా షార్ట్ కట్‌లో వెళ్లిపోవచ్చు. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఈ హెలికాప్టరులే కావాలని మన నాయకులు కోరు'కొంటు'న్నారు.