: రాజకీయ నేతలపై జేపీ విసుర్లు


రాజకీయనేతలపై లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ నిప్పులు చెరిగారు. యువత ఓవైపు సమస్యలతో సతమతమవుతుంటే, నేతలు మాత్రం ఐపీఎల్ తో అంటకాగుతున్నారని మండిపడ్డారు. జేపీ నేడు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ నాయకులు క్రికెట్ తో వచ్చి పడే డబ్బుకోసం అర్రులు చాచుతున్నారని విమర్శించారు. తద్వారా పేదరికాన్ని మరింత పెంపొందిస్తున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News