: బీజేపీలో విలీనమైన నాగం 'నగారా'


టీడీపీని వీడి తెలంగాణ నగారా సమితి నెలకొల్పిన నాగం జనార్థనరెడ్డి నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సాయంత్రం హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ ఆత్మ గౌరవ సభలో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈ సందర్భంగా, బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, నాగం జనార్థనరెడ్డిని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. నాగం రాకతో బీజేపీకి నూతన జవసత్వాలు వచ్చినట్టయిందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News