: 'మట్టి'కోటలో భారత్ జోరు
క్లే కోర్టు గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ గా ప్రసిద్ధికెక్కిన ఫ్రెంచ్ ఓపెన్ లో భారత క్రీడాకారుడు లియాండర్ పేస్ రెండో రౌండ్లో ప్రవేశించాడు. మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో జెలెనా జెంకోవిక్ తో జోడీకట్టిన పేస్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్ లో పేస్, జెలెనా ద్వయం 7-5, 6-3తో డానియెల్, వాస్కొబొయేవా జంటపై విజయభేరి మోగించింది. కాగా, భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా డబుల్స్ లో రెండో రౌండ్లోకి దూసుకెళ్ళింది. అమెరికా తార బెథానీ మాటెక్ జతగా బరిలో దిగిన సానియా 6-3, 6-4తో ఫ్రెంచి జోడీ కోర్నెట్-వర్జినీ పై నెగ్గింది.