: రెస్టారెంట్ వ్యాపారంలోకి సానియా మీర్జా


కాస్త సెలబ్రిటీ హోదా వస్తే చాలు.. తమ పేరిట ఓ రెస్టారెంట్ ప్రారంభించడం ఈమధ్య పరిపాటిగా మారింది. క్రీడాకారులు గానీ, సినిమా స్టార్లు గానీ ఇందుకు మినహాయింపు కాదు. ప్రజల్లో తమకున్న పాప్యులారిటీని పెట్టుబడిగా పెట్టేందుకు రెస్టారెంట్లే తగిన మార్గంలా కనిపిస్తున్నట్టుంది.

సినీ తారల్లో నాగార్జున (ఎన్ గ్రిల్), శర్వానంద్ (కాఫీ హౌస్) హైదరాబాద్ లో ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉండగా..   ఇప్పుడు కొత్తగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ తార గుత్తా జ్వాల కూడా ఇదే బాటలో అడుగుపెడుతున్నారు.

త్వరలోనే 'రిస్ట్రేట్టో' పేరుతో సానియా ఓ రెస్టారెంట్ ఆరంభించనుంది. జ్వాల కూడా తనకు ఈ వ్యాపారం లో ఆసక్తి ఉన్నట్టు వెల్లడించింది. క్రికెటర్లు సచిన్, గంగూలీ, జహీర్ ఖాన్ తమ పేరిట ఎప్పుడో రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే!

  • Loading...

More Telugu News