: హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం
రాష్ట్రస్థాయి 181 వ బ్యాంకర్ల సమావేశం రేపు హైదరాబాద్ లో జరుగనుంది. వ్యవసాయ సంబంధిత స్వల్పకాలిక రుణాలు, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నగదు బదిలీ పథకం, బ్యాంకు ఖాతాలు తెరవడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. తీవ్రవాద పీడిత జిల్లాలకు కార్యాచరణ ప్రణాళిక, ఆ జిల్లాలలో ఫైనాన్షియల్ ఇన్ క్యూజన్ పై కార్యాచరణ ప్రణాళికతో పాటు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కోసం కాల్ సెంటర్ ఏర్పాటు వంటి అంశాలపైనా చర్చ జరుగనుంది. కేంద్ర ప్రభుత్వ పధకాల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు వంటి అంశాలపైనా ఇందులో చర్చ జరుగనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపైనా చర్చించనున్నారు. రేపు తాజ్ హాటల్ లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు, వివిద బ్యాంకుల ముఖ్య అధికారులు హాజరుకానున్నారు.