: క్లింటన్ ప్రసంగానికి కాసుల వర్షం


అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షులుగా వ్యవహరించిన వారిలో బిల్ క్లింటన్ ది ప్రత్యేక స్థానం. యూరోపియన్ దేశాల అంతర్యుద్ధాల్లో వేలుపెట్టి నాటో సహకారంతో విజయం సాధించడం, ఆఫ్రికా దేశాల్లో పాగా వేస్తున్న ఇస్లామిక్ తీవ్రవాదులను నామరూపాల్లేకుండా చేసే ప్రయత్నంలో స్వదేశానికి చేటు కొనితెచ్చుకోవడం క్లింటన్ కే చెల్లింది. 46 ఏళ్ళ వయసులో అధ్యక్ష పీఠం అధిష్టించిన క్లింటన్ 1993 నుంచి 2001 వరకు రెండు దఫాలుగా అమెరికా ప్రథమ పౌరుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పూర్వ అధ్యక్షులకు భిన్నంగా అంతర్జాతీయ వేదికలపై అమెరికా ప్రతిష్ఠ పెంపొందేలా క్లింటన్ కృషిచేశారు. ముఖ్యంగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మైత్రికి ఈ నవతరం ప్రజాస్వామ్య వాది చేయని ప్రయత్నమంటూలేదు.

ప్రపంచ శాంతి కోసం ఎల్లప్పుడూ ముందుండే క్లింటన్, తాజాగా, ఇజ్రాయెల్ అధ్యక్షుడు షిమోన్ పెరెజ్ గౌరవార్థం ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈనెల 18న ఇజ్రాయెల్ వెళ్ళనున్న క్లింటన్.. రెహవోత్ నగరంలో జరిగే ఐదవ అధ్యక్ష సదస్సులో ప్రసంగిస్తారు. ఆయన ఉపన్యాసానికి కార్యక్రమ నిర్వాహకులు కాసుల వర్షం కురిపించనున్నారు. 45 నిమిషాల పాటు సాగే ప్రసంగానికి అక్షరాలా రూ.2.8 కోట్లు చెల్లించనున్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ రాజకీయ నాయకులు, విశ్లేషకులు, కళాకారులు పాల్గొంటారు. కాగా, ఈ భారీ మొత్తాన్ని 'క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్' స్వచ్ఛంద సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు.

  • Loading...

More Telugu News