: జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. సాక్షుల వాంగ్మూలం నమోదు చేసేందుకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎమ్.ఎస్.బాలకృష్ణ విచారణను వాయిదా వేసారు. 1991-96లో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత 66.65 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.