: మత్తు మందు ఇచ్చారు.. ఆపరేషన్ ఆపేశారు!
వైద్య
అధికారుల అలసత్వంతో ఆదిలాబాద్ జిల్లాలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు
చేయించుకునే మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జిల్లాలోని లక్సెట్టిపేటలో ఈ రోజు
కు.ని శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి వచ్చిన మహిళలకు తొలుత మత్తు మందు
ఇచ్చారు. అయితే, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శస్త్ర చికిత్సలు
నిలిపివేశారు. మత్తు మందు ఇచ్చి ఆపరేషన్లు ఆపివేయడంతో మహిళలు
తీవ్ర ఆందోళనకు గురయ్యారు.