: 'లవ్ గురు' అవతారంలో బ్రహ్మి


బ్రహ్మానందం.. పరిచయం అక్కర్లేని కామెడీ కింగ్. టాలీవుడ్లో హీరోల రేంజికి ఎదిగిన ఈ హాస్య నటుడు ఒకప్పుడు కాలేజీలో పాఠాలు బోధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ లెక్ఛరర్ ప్రేమ పాఠాలు నేర్పేందుకు సై అంటున్నాడు. సిద్ధార్థ్, హన్సిక జంటగా వస్తోన్న 'సమ్ థింగ్, సమ్ థింగ్' లో బ్రహ్మి లవ్ గురుగా కనిపించనున్నాడు. బ్రహ్మానందం పాత్ర తమ చిత్రానికి గొప్ప ఎస్సెట్ అని చెబుతున్నారు నిర్మాతలు.

కలెక్షన్ల కోసం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ కమెడియన్ ను ఫోకస్ చేయడం బ్రహ్మానందంతోనే మొదలైందని చెప్పుకోవాలి. ఇటీవలి చిత్రాల్లో కొన్నింటిలో బ్రహ్మిని హైలైట్ చేస్తూ ట్రైలర్లు రిలీజవడం ఈ టాప్ కమెడియన్ సత్తాను చాటుతోంది. పైగా, ఆ చిత్రాలు పెద్ద హీరోలవైనా, బ్రహ్మం ట్యాగ్ లైన్ లేకపోతే ప్రేక్షకాదరణ లోపిస్తోంది. అందుకే, బ్రహ్మానందం నటించే చిత్రాలను ఆయన బ్రాండ్ ఇమేజితోనే మార్కెట్లోకి పంపాలని నిర్మాతలు భావిస్తున్నారు. తాజాగా, 'సమ్ థింగ్..' ప్రొడ్యూసర్లదీ ఇదేమాట, ఇదే బాట.

కాగా, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా నిర్మితమైన 'సమ్ థింగ్, సమ్ థింగ్' జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుందర్. సి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రంలో ఖుష్బూ, గౌతంరాజు, నళిని ఇతర ముఖ్య పాత్రధారులు.

  • Loading...

More Telugu News