: మలేసియాలో పెటాకులవుతున్న పెళ్లిళ్లు


వద్దురా సోదరా... పెళ్లంటే నూరేళ్ళ మంటరా... అంటూ సలహా ఇస్తున్నారు మలేసియాలోని ప్రవాస భారతీయ దంపతులు. ఇక్కడి దంపతులకు పెళ్లంటే చేదు మాత్ర మింగినంత కష్టంగా ఉంటోంది. పరస్పరం సద్దుకుపోలేక కాపురాలను వాళ్లకు వాళ్ళే కూల్చేసుకుంటున్నారు. ఆ విధంగా మలేసియాలో విడాకులు తీసుకుంటున్న ప్రవాస భారతీయులు నానాటికీ పెరిగిపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రవాస భారతీయ సమాజానికి సామాజిక ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాదికి 5 వేల విడాకులు కేసులు నమోదవుతున్నాయని తమిళ సామాజిక సంస్ధ నేత ఎవీ లింగం తెలిపారు. కొన్నేళ్లముందు ఈ సంఖ్య కేవలం రెండు వందలు ఉండేదని ఇప్పుడు అమాంతం పెరిగిపోయిందని, ఇచ్చిపుచ్చుకునే ధోరణి తగ్గిపోవడం, అవగాహనా లోపం వంటి కారణాలతో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసారు.

  • Loading...

More Telugu News