: చైనాలో ఘోర అగ్నిప్రమాదం


చైనాలో నేడు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కోళ్ళ ఉత్పత్తుల కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 119 మంది ప్రాణాలు కోల్పోయారు. జిలిన్ ప్రావిన్స్ లోని డెహూయ్ వద్ద బావోయువాన్ పౌల్ట్రీ యూనిట్లో ఈ దుర్ఘటన సంభవించింది. అకస్మాత్తుగా మంటలు ఎగసిపడడంతో కార్మికులు తప్పించుకునే దారిలేక మాడిమసయ్యారు. ఘటనా సమయంలో ఇక్కడ 300 మంది విధుల్లో ఉన్నారు. అత్యవసర ద్వారం సకాలంలో తెరుచుకోకపోవడం మృతుల సంఖ్య పెరిగేందుకు కారణమైంది. మండే స్వభావం కలిగిన రసాయనం లీకవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 2000, డిసెంబర్ 25న హెనాన్ ప్రావిన్స్ లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ అగ్నికి ఆహుతి కాగా 309 మంది చనిపోయారు. ఆ ప్రమాదం తర్వాత చైనాలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఇదే.

  • Loading...

More Telugu News