: తుపాకీతో అగంతకుడి హల్ చల్


అహ్మద్ పటేల్ నివాసం వద్ద ఓ అగంతకుడు హడావుడి సృష్టించాడు. తుపాకీతో ఆయన ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ నివాసం వద్ద ఓ అగంతకుడు రివాల్వర్ తో ఈ రోజు ఇలా హల్ చల్ చేసాడు. పటేల్ ఇంట్లోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చివరికి పోలీసులు అరెస్టు చేసారు. అతని వద్ద నుంచి రివాల్వర్, 20 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అగంతకుడ్ని హర్యానాకు చెందిన జోగీందర్ సింగ్ గా గుర్తించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News