: పీఎఫ్ సీలింగ్ పెంపు ప్రతిపాదనపై ప్రభుత్వం యోచన
చిరుద్యోగులకు శుభవార్త. భవిష్యనిధి (ప్రావిడెంట్ ఫండ్) సీలింగును రూ. 6, 500 నుంచి రూ. 15,000కు పెంచాలని ప్రతిపాదించినట్లు కేంద్రమంత్రి సురేష్ తెలిపారు. విజయనగరంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఈఎస్ఐ ఉద్యోగుల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, సనత్ నగర్ లలో హీమోడయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఈ నెల 20,21 తేదీల్లో కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విరమించుకోవాలని కోరారు.